74ఏళ్ల తర్వాత కలుసుకున్న సోదరులు- భావోద్వేగంతో కంటతడి - పాకిస్థాన్ కర్తార్‌పుర్ సాహిబ్
Viral Video: 1947లో భారత్-పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఎన్నో కుటుంబాలు వేరుపడ్డాయి. కొందరు తమ బంధుమిత్రులను కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. మరికొందరు మాత్రం తమ వారిని చేరుకోలేకపోయారు. ఆ కోవకే చెందిన ఇద్దరు సోదరులు.. 74 ఏళ్ల తర్వాత ఒకదగ్గరికి చేరారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ సాహిబ్ ఇందుకు వేదికైంది. ఇన్నేళ్ల అనంతరం కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.