Kabul airport blast: ముందు తాలిబన్ల కాల్పులు- కాసేపటికే పేలుళ్లు!
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని విమానాశ్రయం వద్ద వరుస పేలుళ్లలో వంద మందికిపైగా మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే.. పేలుళ్లు సంభవించేందుకు ముందు విమానాశ్రయం వద్ద ఉన్న ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపిన క్రమంలో భయంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టుకు పోటెత్తుతున్న జనాన్ని నియంత్రించేందుకు తాలిబన్లు తరచుగా గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఇది జరిగిన గంట తర్వాత ఇద్దరు బాంబులతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. ఓ సాయుధుడు కాల్పులకు పాల్పడ్డాడు.