బారాత్లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు - పెళ్లి గానాబజానాలో 'లగే రహో కేజ్రీవాల్' గీతం
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు రోజుల్లో సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ ప్రచారాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే 'ఆమ్ ఆద్మీ'కి చెందిన ఓ కార్యకర్త ఏకంగా తన కుటుంబ పెళ్లి వేడుకలోని గానాబజానా కార్యక్రమంలో ఆప్ ప్రచార గీతం'లగే రహో (జిందాబాద్) కేజ్రీవాల్' ప్లే చేశాడు. దీంతో వచ్చిన ఆహ్వానితులంతా కలిసి ఆ గీతానికి దిల్ ఖుష్ అయ్యేలా ఉర్రూతలూగుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఫ్రిబవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Last Updated : Feb 29, 2020, 9:25 AM IST