రైలు కింద మహిళ.. ప్రాణాలు రక్షించుకుంది ఇలా - గూడ్స్ రైలు
హరియాణలోని రోహ్‌తక్‌లో ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. రైల్వేస్టేషన్‌కు సమీపంలో లెవర్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. రైలు ఆగి ఉన్న కారణంగా క్రాసింగ్‌ను దాటేందుకు ఆమె ప్రయత్నించింది. ఇంతలో రైలు కదిలింది. తనను తాను రక్షించుకునేందుకు రైలు కిందకి చేరి ఆ మహిళ అలాగే ఉండిపోయింది. రైలు వెళ్లిపోయిన అనంతరం పట్టాల నుంచి బయటకి వచ్చి ప్రాణాలు రక్షించుకుంది.