నమస్తే ట్రంప్: జనసంద్రంలా మోటేరా స్టేడియం - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020
'నమస్తే ట్రంప్' కోసం గుజరాత్ మోటేరా స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఉదయం నుంచే భారీ సంఖ్యల్లో ప్రజలు స్టేడియానికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయి. వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన మోటేరా.. ట్రంప్ రాక, మోదీ-ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తోంది.
Last Updated : Mar 2, 2020, 9:26 AM IST