పీపీఈ కిట్‌తో అంబులెన్స్ డ్రైవర్ డ్యాన్స్ - అంబులెన్స్ డ్రైవర్ డ్యాన్స్
దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తుంటే.. పని ఒత్తిడితో విసిగిపోయిన ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం తీన్మార్ డ్యాన్స్ వేశాడు. పీపీఈ కిట్ ధరించి పెళ్లి బ్యాండ్ మేళంతో కలిసి చిందేశాడు. డ్రైవర్ వేషధారణ చూసిన అక్కడి వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాను ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపాడు డ్రైవర్ సుశీల్ తివారీ. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.