ప్రధాని కోసం 15 కిలోల చాక్లెట్ మందిరం - చాక్లెట్ మందిరం
అచ్చం రామ మందిరమే.. ఈ నమూనా తయారీ కోసం 15 కిలోల తియ్యని, రుచికరమైన చాక్లెట్‌ను ఉపయోగించారు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన శిల్పాబెన్. 12 గంటలపాటు కష్టపడి దీన్ని సిద్ధం చేశారామె. అయోధ్యలో భూమి పూజ జరగనున్న నేపథ్యంలో బుధవారం చాక్లెట్ మందిరానికి పూజలు చేయనున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి ఈ మందిరాన్ని బహూకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు శిల్పాబెన్.