కారు ఢీకొడితే ఎగిరి బైక్ కింద పడ్డాడు.. కానీ! - బైక్ యాక్సిడెంట్ న్యూస్
పాలు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లిన ఓ బాలుణ్ని కారు ఢీకొట్టింది. అతను గాల్లో ఎగిరి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలు కాగా... ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తీరు మాత్రం భయభ్రాంతులకు గురి చేసింది. కర్ణాటకలోని సాంప్యా గ్రామ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.