40 కిలోల చాక్లెట్ వినాయకుడ్ని చూశారా! - వినాయక చవితి వేడుకలు
కరోనా కారణంగా ఈ సారి గణేష్ చతుర్థి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. పంజాబ్ లుధియానాలోని బెల్ఫ్రాన్స్ బేకరీ నిర్వాహకులు ప్రతి సంవత్సరంలాగే ఈసారీ కూడా ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేశారు. ఓ కేక్‌తో పాటు 40 కిలోల చాక్లెట్ గణనాథున్ని రూపొందించారు. బంగారు వర్ణంతో అలకరించిన ఈ లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాాడు. ఒక కేజీ నుంచి 10 కేజీల పరిమాణంలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కూడా భక్తుల కోసం తయారు చేశారు.