మొసలితో ఫొటోల కోసం యువకుల దుస్సాహసం - A crocodile was found in the Vannathu Lake in Virudhachalam
తమిళనాడు కడలూరు జిల్లా విరుదాచలంలో ఓ మొసలిని పట్టుకుని ఫొటోల కోసం దుస్సాహసం చేశారు స్థానిక యువకులు. వన్నతు సరస్సులో నీటిమట్టం పెరిగి పొలాల్లోకి వచ్చింది 6 అడుగుల మొసలి. గమనించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారుల రాక ఆలస్యం అయిన కారణంగా సమయం వృథాగా పోనియ్యకుండా మొసలిని పట్టేశారు స్థానిక యువకులు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొసలితో ఫొటోలు తీసుకున్నారు. కాసేపటికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
TAGGED:
crocadile found