తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్రైనేజీలో అపస్మారక స్థితిలో మందుబాబు.. తీరా లేపి చూస్తే..! - drunker dead found alive

By

Published : Jan 18, 2022, 1:50 PM IST

తమిళనాడు డిండిగుల్ జిల్లాలో పీకలదాకా తాగి.. నడవడానికి కూడా ఓపికలేని ఓ వ్యక్తి బ్రిడ్జికింద మురుగు నీటిలో పడిపోయాడు. ఆహా ఏమి సుఖం.. అనుకున్నాడో ఏమో.. అలాగే నీటిలో తేలియాడుతూ అక్కడే ఉండిపోయాడు. అది చూసిన మరో వ్యక్తి చనిపోయాడనుకుని పోలీసులకు ఫోన్​ చేశాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది అతడిని బయటకు తీశారు. తీరా చూస్తే.. అతడు బతికే ఉన్నాడు. జిల్లాలో ఆళగువరపట్టికి చెందిన మురుగవేలుగా ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details