ఏటీఎంకు వెళ్లిన కోతి.. ఎందుకో తెలుసా? - దేశరాజధాని దిల్లీ
దేశరాజధాని దిల్లీలో ఓ వానరం ఏటీఎంకు వెళ్లింది. అయితే మనషుల్లా డబ్బు తీసుకునేందుకు కాదు. లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం వెతుకుతూ ఖాళీగా ఉన్న ఏటీఎంలో చొరబడింది. అందులో తినేందుకు ఏమైనా ఉన్నాయోమోనన్న ఆశతో మెషీన్ను పాడు చేసింది. చివరకు నిరాశతో వెనుదిరిగింది. దిల్లోని సౌత్ అవెన్యూ ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది.