కాటేసిందనే కోపంతో పామునే కరిచేశాడు! - మహారాష్ట్రలో పామును కొరికిన వ్యక్తి
కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ.. మరికొన్ని విషయాలు మాత్రం గగుర్పొడుస్తాయి. మహారాష్ట్ర హింగోలి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కస్బే ధావండ గ్రామంలో ఓ నివాస ప్రాంతానికి పాము వచ్చింది. దానిని పట్టుకునేందుకు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అయితే పట్టుకునే క్రమంలో అతడిని పాము కరిచింది. కోపంతో వెంటనే ఆ సర్పాన్ని పట్టుకొని కొరికేశాడు ఆ వ్యక్తి. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు.