నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు
'నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు'. దీనిని నిజం చేస్తూ ఒడిశా జర్సుగూడ రైల్వే స్టేషన్లో ఒళ్లు గగుర్పొడిచే ఓ ఘటన జరిగింది. వేగంగా వెళ్లున్న రైలును అందుకోబోయిన ఓ వ్యక్తి అదే రైలు కింద పడ్డాడు. అందరూ చూస్తుండగానే ... క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది. అయితే అదృష్టం బాగుండి... భూమిపై అతనికి నూకలుండి... ప్రాణాలతో బయటపడ్డాడు. నిర్లక్ష్యం ప్రాణాంతకం!... తస్మాత్త్ జాగ్రత్త!