'ఆధార్' కోసం రక్షణమంత్రి కాన్వాయ్‌కు అడ్డం! - రక్షణమంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా వచ్చిన వ్యక్తి
రక్షణమంత్రి కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటు సమీపంలోని రోడ్డుపై రాజ్‌నాథ్ సింగ్ వాహనశ్రేణి వస్తోన్న సమయంలో అడ్డంగా పడుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. వెంటనే స్పందించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఉత్తర్‌ప్రదేశ్ ఖుషీనగర్‌కు చెందిన 35 ఏళ్ల విశంభర్ దాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు ఆ వ్యక్తి. విశంభర్ దాస్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.