లైవ్ వీడియో: సినీ ఫక్కీలో 'గర్ల్ ఫ్రెండ్' కిడ్నాప్! - kolar boyfriend kidnapped girl friend
కర్ణాటక, కోలార్ జిల్లా కిలారిపేటేకు చెందిన శివ.. దేవాంగపేటేకు చెందిన యువతితో ప్రేమలోపడ్డాడు. యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు చూసినవారినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది అమ్మాయి. అయితే ప్రేయసి నిర్ణయాన్ని తట్టుకోలేక బాయ్ ఫ్రెండ్ శివ ఇన్నోవా కారులో ఓ బృందంతో వచ్చి పట్టపగలే గర్ల్‌ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.