నాసిక్ వీధుల్లో చిరుత సంచారం.. ఇద్దరిపై దాడి - నాసిక్‌లో మనుషులపై చిరుత దాడి
మహారాష్ట్రలోని నాసిక్‌లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇందిరానగర్‌లో శుక్రవారం ఒక వ్యక్తిపై దాడి చేసింది చిరుత.. తాజాగా మరొకరిని తీవ్రంగా గాయపరిచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇందిరా నగర్‌లో జరిగిన దాడి దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత అడుగు జాడలను గుర్తించినట్లు వెల్లడించిన అటవీశాఖ అధికారులు.. త్వరలోనే ఆ మృగాన్ని పట్టుకుంటామని వివరించారు.