లాక్డౌన్ మీకు- స్వేచ్ఛ మాకు.. రోడ్లపై గజరాజుల విహారం - kodagu latest news
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో వన్య ప్రాణులకు ఎప్పుడూ లేనంత స్వేచ్ఛ లభించింది. అడవిని వీడి బహిరంగ ప్రదేశాల్లో విహరిస్తున్నాయి. కర్ణాటక కొడగు జిల్లా విరాజపేటే మల్ధారే జంక్షన్లో అలాంటి దృశ్యమే కనిపించింది. ఏనుగుల గుంపు కాసేపు రోడ్డుపై షికారు చేసింది.