తెలంగాణ

telangana

ETV Bharat / videos

'అమ్మ' ప్రేమంటే ఇదే... వాననీటిలో పిల్లను చూడలేక... - female dog rescues her puppy in rain water

By

Published : Oct 18, 2020, 1:51 PM IST

వరద నీటిలో ఉండిపోయిన తన పిల్లను రక్షించుకునేందుకు మనుషుల్లాగే ప్రవర్తించింది ఓ కుక్క. మాతృమూర్తి ప్రేమ ఎవరిలోనైనా ఒకటేనని చాటి చెప్పింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక విజయపుర జిల్లాలోని తారాపుర్​ గ్రామం నీట మునిగింది. అయితే ఆ వానల దెబ్బకు ఆ కుక్క ఉండే ప్రాంతం జలమయమైంది. అయితే వర్షపు నీటిలో ఉండి ఏడుస్తున్న తన పిల్లను చూసి తల్లి శునకం తల్లడిల్లింది. వెంటనే నోట కరచుకొని నీటిలోనే కొంతదూరం తీసుకెళ్లి సురక్షిత ప్రదేశంలో దాచేసింది. ప్రస్తుతం ఈ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details