సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు - మహారాష్ట్ర సంగ్లీ ఠాక్రే
మహారాష్ట్రలోని సంగ్లీలో భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు భాజపా వర్గాలు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో సీఎంకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా అక్కడే ఉన్న శివసేన కార్యకర్తలు సైతం నినాదాలు చేయడం వల్ల.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకొన్నారు.