లైవ్ వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన ఒంటె - Devbhoomi Dwaraka news
గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దేవ్భూమి ద్వారకా జిల్లాను వరదలు ముంచెత్తాయి. ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడం వల్ల.. రోడ్డుపై ఉన్న ఓ ఒంటె పిల్ల క్షణాల వ్యవధిలోనే నీటిలో కొట్టుకుపోయింది. తనను తాను రక్షించుకునేందుకు ఆ ఒంటె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.