తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒకే చోట 98 పాములు.. జనం హడల్ - గుట్టలకొద్దీ బయటపడ్డ పాములు

By

Published : May 24, 2021, 7:37 PM IST

సాధారణంగా ఒకటీ రెండూ పాములు కనపడితేనే హడలిపోతాం. అలాంటిది వంద సర్పాలు ఒకే చోట దర్శనమిస్తే.. గుండె గుబేలే ఇక. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో జరిగింది. అర్వి ప్రాంతంలో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా బాత్​రూమ్ కట్టే సమయంలో.. రెండు నీళ్ల డ్రమ్ముల కింద నుంచి 98 పాములు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు అక్కడివారు. అయితే అవన్నీ విషంలేని పాములు కావడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. అటవీ అధికారులు సమాచారం అందించగా.. వారు వాటిని ఓ రిజర్వ్ ఫారెస్టులో వదిలేశారు.

ABOUT THE AUTHOR

...view details