తెలంగాణ

telangana

ETV Bharat / videos

కర్రసాముతో అదరగొడుతున్న 85 ఏళ్ల బామ్మ - మహారాష్ట్ర వార్తలు

By

Published : Jul 24, 2020, 5:28 PM IST

సాధారణంగా కర్రసాము అనగానే.. వీధుల్లో మగరాయుళ్లు గోచీ కట్టుకుని సాహసంగా చేయడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా.. ఓ 85 ఏళ్ల బామ్మ తన 'లాఠీకాఠీ(కర్రసాము)'తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కరోనా కారణంగా జీవనోపాధి కరవైన నేపథ్యంలో.. తన తండ్రి నేర్పిన మార్గాన్ని ఎంచుకున్నానంటున్నారు మహారాష్ట్ర- పుణెకు చెందిన శాంతాబాయి పవార్. తన 8 ఏళ్ల వయసు నుంచే ఈ విద్య అలవడిందన్న శాంతాబాయి.. ఇలాగే మనుమరాళ్ల చదువు కోసం డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details