ఘనంగా గణతంత్ర వేడుకలు- అబ్బురపరిచిన విన్యాసాలు - 73 గణతంత్ర వేడుకలు
Republic day 2022: 73వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు రాజ్‌పథ్‌లో నిర్వహించిన కవాతులో పాల్గొన్నాయి. ఈసారి కొత్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు చేసింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతలంలో మొత్తం 15 ఆకృతులను ప్రదర్శించారు. 75 మీటర్ల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న పది స్క్రోల్స్‌లను తొలిసారిగా పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిని సుమారు 600 మంది ఆర్టిస్టులు తీర్చిదిద్దారు. వందే భారతం పేరిట దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించి ఎంపిక చేసిన 480 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.