యుద్ధ్ అభ్యాస్: భారత్-అమెరికా సైనిక విన్యాసాలు - Indo-US joint military exercise news updates
భారత్-అమెరికా ఆర్మీ దళాలు సంయుక్తంగా నిర్వహించే యుద్ధ్ అభ్యాస్ 16వ విడత శిక్షణ కార్యక్రమాలు రాజస్థాన్‌లో కొనసాగుతున్నాయి. పశ్చిమ సెక్టార్‌లోని మహాజన్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా సైన్యానికి చెందిన అధునాతన లైట్ హెలికాప్టర్లు సహా పలు వాహనాలు, భారత్ ఆర్మీకి చెందిన ఇన్‌ఫాంట్రీ కంబాట్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. యుద్ధ సమయాల్లో అనుసరించే వ్యూహాన్ని, ఆధునిక పోరాట రీతులను ఇరు దేశాల సైన్యాలు ప్రదర్శించాయి.