Accident In Jharkhand: వామ్మో.. ఇదేం యాక్సిడెంట్ గురూ.. - Jharkhand Accident trailer
Accident In Jharkhand: ఝార్ఖండ్, రామ్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సాహో సినిమాలో యాక్షన్ సీన్‌ను తలపించేలా ఉంది మరి. ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బీభత్సమే సృష్టించింది. ఎదురుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ట్రక్కులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో తీశారు. ఈ ఘటనలో 6 వాహనాలు నుజ్జునుజ్జయినట్లు తెలిపారు. రామ్‌గఢ్‌లోని పటేల్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST