40 అడుగుల కొబ్బరిచెట్టుపై ఇరుక్కున్న వ్యక్తి.. తర్వాత ఏమైందంటే? - మహారాష్ట్ర న్యూస్
Man Trapped In Palm Tree: కొబ్బరి చెట్టుపై చిక్కుకున్న వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించిన ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది. సుజిత్ జ్ఞాన్‌దేవ్ అనే వ్యక్తి ఇంటి పెరడిలో కొబ్బరిచెట్టు ఉంది. దానికి కాయలు కాయగా కోయాలని భావించాడు. అందుకోసం 40 అడుగుల ఎత్తైన కొబ్బరి చెట్టును నిచ్చెన సాయంతో ఎక్కాడు. కాయలు కోస్తుండగా హఠాత్తుగా నిచ్చెన పడిపోయింది. దీంతో చెట్టుపైనే చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సుజిత్‌ను కిందకు దించారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST