తెలంగాణ

telangana

ETV Bharat / videos

5లక్షల దీపాలతో 150 అడుగుల శ్రీరాముడి చిత్రం - శ్రీరామనవమి న్యూస్​

By

Published : Apr 8, 2022, 4:31 AM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

బిహార్ భగల్​పుర్​లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏప్రిల్​ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని 150 అడుగుల పొడవైన రాముడి చిత్రాన్ని రూపొందించారు. పట్టణంలోని లజ్​పత్​పార్క్​లో 5 లక్షల దీపాలను, 12 రకాల రంగులను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారుచేశారు. ఈ చిత్ర తయారీ గత ఐదు రోజులుగా కొనసాగుతుండగా.. అనేక మంది పాలుపంచుకున్నారు. గిన్నిస్ బుక్​ ఆఫ్​ రికార్డ్​లో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నామని నిర్వాహకుడు అర్జిత్​ చౌబే తెలిపారు. శ్రీరామ నవమి రోజు జరిగే కార్యక్రమానికి బిహార్​ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్​, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details