ఇటుకల మధ్య 12 అడుగుల 'పైథాన్'.. కూలీలు హడల్! - కొండ చిలువ
python rescue: గుజరాత్‌లోని వడోదరాలో 12 అడుగులు భారీ పైథాన్‌ను శనివారం కాపాడింది వైల్డ్‌లైఫ్ రెస్క్యూ బృందం. ఓ భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఇది కనిపించింది. భారీ కొండ చిలువను చూసి కూలీలు పరుగులు పెట్టారు. పైథాన్ గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని రక్షించి.. అటవీ శాఖకు అప్పగించినట్లు జంతువులపై దాడుల నియంత్రణ సంస్థ సభ్యుడు రాజ్భవ్సార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన మరో సంఘటనలో బావిలో పడిన 2 అడుగుల పొడవైన కోబ్రాను రక్షించారు ప్రైవేటు వైల్డ్‌లైఫ్ రీసర్చ్ ఆర్గనైజేషన్ సభ్యులు. దానిని అటవీ ప్రాంతంలో వదలిపెట్టినట్లు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST