YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి, మరో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసు విషయంలో ఆ ఇద్దరు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
YS Bhaskar Reddy And Uday Bail Petitions Dismissed.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇటీవలే సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. నిందితులు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. గత నెల 24న వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో ఈరోజు వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణ వాయిదా.. ముగ్గురు నిందితులకు రిమాండ్
Telangana High Court Mentions Key Points on Viveka Murder Case.. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌లకు బెయిల్ నిరాకరించిన తెలంగాణ హైకోర్టు కీలక విషయాలను ప్రస్తావించింది. ''భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డి ఏపీ సీఎంకు సన్నిహిత బంధువు. ఏ-8, ఎంపీ అవినాష్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి తండ్రి. అవినాష్, భాస్కర్, శివశంకర్‌కు ఉదయ్ అనుచరుడు. భాస్కర్, ఉదయ్ నేరాలపై నమ్మదగిన ఆధారాలున్నాయి. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో ఆధారాలున్నట్లు కనిపిస్తోంది. భాస్కర్, ఉదయ్ ప్రమేయంపై కూడా ఆధారాలున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ భాస్కర్, ఉదయ్ అత్యంత ప్రభావశీల వ్యక్తులు. సాక్షులంతా ఏపీ వారే.. ఇద్దరూ ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షులను భాస్కర్, ఉదయ్ బెదిరించే అవకాశం కూడా ఉంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా విచారణ జరపడం ట్రయల్ కోర్టుకు వీలుకాకపోవచ్చు. సాక్షుల భద్రత, పారదర్శక విచారణపై జాగ్రత్త తీసుకోవాలి'' అని ధర్మాసనం వెల్లడించింది.