తెలంగాణ

telangana

ETV Bharat / t20-world-cup-2022

T20 worldcup: టీమ్​ఇండియా ప్లేయర్స్​కు ధోనీ అడ్వైస్​.. ఆ స్పెషల్​ బ్యాట్​ ఉపయోగించమని.. - ధోనీ టీమ్​ఇండియా అడ్వైస్​

టీ20 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో భారత్ అదరగొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన ఆటగాళ్లందరికీ ఈ మెగాటోర్నీ ప్రారంభం అవ్వకముందు మాజీ కెప్టెన్​ కొన్ని సలహాలు ఇచ్చాడంటే. ఏంటంటే.

ఎంఎస్ ధోనీ
ms dhoni

By

Published : Oct 29, 2022, 5:06 PM IST

టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పాకిస్థాన్​, నెదర్లాండ్స్​పై ఆడిన రెండు మ్యాచ్‌లలో ఘన విజయాన్ని అందుకుంది. ఆటగాళ్లు మంచి ప్రదర్శనను చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు. దీంతో భారత జట్టు గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడబోతోంది. టీమ్ ​ఇండియాతో సమవుజ్జీగా ఉన్న జట్టు కావడం వల్ల ఈ మ్యాచ్‌‌లో పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
అయితే ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో గమనిస్తే హార్దిక్​, కేఎల్​ రాహుల్​, రోహిత్​ శర్మ సహా పలువురు రౌండ్​-బాటమ్డ్​ బ్యాట్స్​ను వినియోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హార్దిక్​, రాహుల్​, పంత్​ల​ను గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇటువంటి బ్యాట్​ను గతంలో పవర్​హిట్టింగ్ కోసం మాజీ కెప్టెన్ ధోనీనే ఉపయోగించేవాడు. దీనిని మహీ వ్యూహ్మాత్మక ప్రణాళికలో భాగంగా వినియోగించేవాడు. ఇప్పుడదే బ్యాట్స్​ను తాజాగా హార్దిక్​, రాహుల్ సహా మిగతా వారు కూడా వాడుతున్నారు.
అయితే వీరు ధోనీ సూచించడం వల్లే ఈ బ్యాట్​ను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి​ ముందు మన ఆటగాళ్లు ధోనీని కలిసి కొన్ని విలువై సూచనలు తీసుకున్నారట. ఈ క్రమంలోనే మన బ్యాటర్లకు ఈ టోర్నీలో ఆటకు ఎలాంటి బ్యాట్​ ఉపయోగించాలనే విషయమై మహీ మాట్లాడినట్లు తెలిసింది. టీ20 ప్రపంచకప్ ఆరంభం కావడానికి ముందే పాండ్య, పంత్ ఇద్దరూ ఎంఎస్ ధోనీని సంప్రదించినట్లు ప్రముఖ స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ సన్స్‌పారీల్స్ గ్రీన్‌ల్యాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ తెలిపారు. "ఇలాంటి బ్యాట్​ను 2019 ప్రపంచకప్​ ముందు తొలిసారి మహీ వాడటం ప్రారంభించాడు. ఇప్పుడు అదే బ్యాట్​ను మన ఇండియన్ ప్లేయర్స్ వినియోగిస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details