ప్రపంచకప్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నమోదైంది. ఆఖరి వరకు ఊగిసలాట మధ్య సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ కష్టంగా గెలిచింది. జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ షాంటో(71) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బౌలర్లు ఎంగరవ(2), ముజరబాణి(2), రజా(1), సీన్ విలియమ్స్(1) వికెట్లు తీశారు.
ETV Bharat / t20-world-cup-2022
ప్రపంచకప్లో మరో ఆసక్తికర మ్యాచ్.. జింబాబ్వేపై అతికష్టం మీద బంగ్లా విజయం - టీ20 వరల్డ్ కప్ 2022
చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో గెలిచింది.
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేసింది. మొదట తడబడినా ఆ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆఖరి ఓవర్లలో ఒత్తిడికి గురైనా.. జింబాబ్వే టెయిలెండర్లు మ్యాచ్ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. 20వ ఓవర్లో చివరి బంతి నోబాల్ అయినప్పటికీ.. జింబాబ్వే విజయతీరానికి చేరలేకపోయింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో సీన్ విలియమ్స్(64) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చకబ్వా(15), రియాన్ బర్ల్(27) ఫర్వాలేదనిపించారు.