చాలా మందికి నిద్రే బంగారం. లేస్తూనే.. 'అప్పుడే తెల్లారిపోయిందా' అనుకునే వాళ్లు ఎందరో! నిద్రించే సమయంలో.. బెడ్‌పై పడుకుని దొర్లుతూ ఉంటారు కొందరు. దిండును హత్తుకుని పడుకునేవారు ఇంకొందరు. బెడ్ షీట్‌ను చుట్టుకుని కలల ప్రపంచంలోకి జారుకునే వారు మరికొందరు. అయితే..
మనం ఊహించినంత నీట్‌గా 'బెడ్' ఉండదనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదని ఓ అధ్యయనంలో తేల్చారు లండన్‌కు చెందిన ఓ మైక్రోబయాలజిస్ట్.
చెమట, ఉమ్ము, డాండ్రఫ్, మృత చర్మ కణాలు, ఆహార పదార్థాలు మొదలైనవి బెడ్‌పై ప్రమాదకరజీవుల్లా మారుతాయని సూక్ష్మజీవుల నిపుణుడు చెప్పారు. వీటి కారణంగా బెడ్‌పై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వ్యాప్తిచెందుతాయని వివరించారు.
బ్యాక్టీరియా..
బెడ్షీట్లపై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఓ ఆసుపత్రిలోని బెడ్షీట్లపై నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా.. బెడ్షీట్లపై అధికంగా ఉన్నట్లు వారు గుర్తించారు.
స్టాఫిలోకొక్కస్ ప్రమాదకర బ్యాక్టీరియా కాదు. కానీ.. చర్మంపై గాయాలైన చోట నుంచి ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.
స్టాఫిలోకొక్కస్ ఆరియస్- స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా జాతిలో ఇది చాలా ప్రమాదకారి. దీని వల్ల చర్మ వ్యాధులు, నిమోనియా, మెటిమలు తీవ్రమవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
ఈ కొలి బ్యాక్టీరియా(E. Coli)- ఈ రకం బ్యాక్టీరియా కూడా ఆసుపత్రి బెడ్లపైనే ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, నిమోనియా, డయేరియా, నాడీమండల పటలశోథ(meningitis), సెప్సిస్(sepsis) మొదలైన వ్యాధులు సంక్రమిస్తాయి.
ఈ కొలి బ్యాక్టీరియా స్ట్రెయిన్లు మరింత ప్రమాదకరమని నిపుణులు అధ్యయనంలో తేల్చారు.
పురుగులు(Bugs)
నిద్రిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి సాధారణంగా 500 మిలియన్ల చర్మ కణాలు బెడ్‌పై పడతాయి. నల్లులు వీటిని ఆహారంగా సేవిస్తాయి. ఈ పురుగులు వదిలే వ్యర్థాల ద్వారా అలర్జీ, ఆస్తమా వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది.
బెడ్‌పై ఉండే ఈ పురుగులు ద్వారా.. చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఒత్తిడి, నిద్రలేమి, అలర్జీ వంటి మానసిక సమస్యలకు ఇవి కారణం అవుతాయి.
బట్టలు, బ్యాగుల ద్వారా నల్లులు(bed bugs) ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంది. ఈ కీటకాలను అంతం చేయాలంటే.. బెడ్షీట్లను ఉతికి అధిక ఉష్ణోగ్రత(55 డిగ్రీల సెంటిగ్రేడ్)లో ఆరబెట్టాలి.
సూక్ష్మజీవులు(Household germs)
పరిశుభ్రంగా లేని వస్తువుల ద్వారా సూక్ష్మజీవులు బెడ్‌పైకి చేరతాయి. బట్టలు, టవల్స్, కిచెన్‌లోని వస్తువులు, పెంపుడు జంతువుల ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్, కిచెన్ టవల్స్ ద్వారా ఎస్ ఆరియస్, ఈ కొలి బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.
- బట్టలు సరిగ్గా ఇస్త్రీ చేయకపోయినా రోగాలు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్రమైన బెడ్‌షీట్స్, టవల్స్ ద్వారా సెగరోగం(gonorrhoea) వచ్చే అవకాశాలు ఎక్కువ.
- ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు బట్టలపై 8-12 గంటల వరకు బతికి ఉంటాయి. వ్యాక్సీనియా వంటి ఇతర వైరస్లు ఉన్ని, కాటన్ దుస్తులపై 14 వారాల పాటు జీవిస్తాయి. వీటి వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి.
బెడ్‌ను పరిశుభ్రంగా ఉంచుకునేదెలా?
- బట్టలు, బెడ్షీట్లు రెగ్యులర్‌గా, సరిగ్గా ఉతకడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను అంతం చేయొచ్చు. రోజూ బెట్‌షీట్లను ఉతకలేం కాబట్టి వాటిని ప్రతి ఉదయం గాలికి ఆరబెట్టాలి.
- కనీసం రెండు వారాలకోసారైనా బెడ్షీట్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్ పరిసరాలను వ్యాక్యూమ్ క్లీనింగ్ ద్వారా రోజూ శుభ్రపరుచుకోవడం మంచిది.
- నగ్నంగా నిద్రించేవారు, ఎక్కువ సమయం బెడ్‌పైనే గడిపేవారు, ఎక్కువ చెమట వచ్చేవారు వారానికోసారి బెడ్షీట్లను తప్పనిసరిగా ఉతకాలి. రెండు, మూడు రోజులకు దిండు కవర్లను మార్చాలి.
- పడుకునేముందు స్నానం చేయడం, చెమటలు పడుతుండగా బెడ్‌పై కునుకు తీయడం, బెడ్‌పై కూర్చుని లోషన్స్, ఆయిల్ మొదలైనవి అప్లై చేయడం మంచిదికాదు.
- పెంపుడు జంతువులను బెడ్లకు దూరంగా ఉంచాలి.
- బెడ్‌పై ఆహారం, పానీయాలు సేవించరాదు.
ఇదీ చదవండి:పొట్టలోని బ్యాక్టీరియా వల్లే.. చిన్నవయస్సులో అనారోగ్యం!