ఆహార, జీవన శైలీలో మార్పులు, చిరుతిళ్లుకు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువమంది పిల్లలు ఒబేసిటీ బారిన పడుతున్నారు. తర్వాత బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆహారాన్ని తగ్గించడం సహా ఎన్నేన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మూంగ్ దాల్ పరోటాతో పిల్లల్లో బరువు పెరుగుదలకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి ప్రోటీన్‌తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయని అంటున్నారు.
కావాల్సిన పదార్థాలు
ఉడికించిన పెసరపప్పు- 1కప్పు, గోధుమ పిండి- 1కప్పు, పుదీన-కొద్దిగా, అల్లం,వెల్లుల్లి పేస్ట్ - పావు టీస్పూన్, నూనె- పావు టీస్పూన్, పసుపు- పావు టీస్పూన్, కారం- పావు టీస్పూన్, ఆమ్‌చూర్‌పొడి- పావు టీస్పూన్, గరంమసాల పొడి- పావు టీస్పూన్, ఉప్పు- తగినంత.
తయారీ విధానం
ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని, గోదుమ పిండి, ఉప్పు, కారం, ఆమ్‌చూర్‌పొడి, గరంమసాల పొడి, అల్లం,వెల్లుల్లి పేస్ట్, పుదీన వేసుకుని.. తగినన్ని నీళ్లు వేసి బాగా కలపాలి. పరోటాలను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు మధ్యలో ఉంచి, కాస్త గరంమసాల వేసి మరో పరోటాతో దానిని మూసివేసి, రోల్ చేయాలి. తర్వాత నూనె వేసి దానిని రెండు వైపులా బాగా కాల్చాలి.
రాడిష్ రైతా