తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అధిక కొవ్వు కరగాలంటే.. ఈ ఆసనాలు వేయాల్సిందే! - yoga asanas

పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించాలన్నా.. గర్భాశయ, మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం పొందాలన్నా.. ఈ ఆసనాలను ప్రయత్నించండి.

yoga asanas to reduce fat
కొవ్వు కరిగించే ఆసనాలు

By

Published : Oct 11, 2020, 8:48 AM IST

మాలాసనం:

రెండుకాళ్లను దూరంగా పెట్టి నేల మీద కూర్చోవాలి. అయితే శరీరాన్ని నేల మీద ఆనించకూడదు. మోచేతులతో మోకాళ్లను నెడుతూ నమస్కార ముద్రలో ఉండాలి. శ్వాస తీసుకుని వదులుతుండాలి. ఈ ఆసనంలో 30-60 సెకన్లపాటు కూర్చోవాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. దీనివల్ల కటి కండరాలూ బలోపేతమవుతాయి.

చక్రాసనం:

వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడిచి రెండు కాళ్ల మడమలను పిరుదులకు ఎదురుగా ఉంచాలి. రెండు చేతులను చెవి పక్కన, చేతివేళ్లు భుజం వైపు వచ్చేలా పెట్టాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతుల మీద బరువు వేసి నడుముని పైకి లేపాలి. శరీరాన్ని ఏమాత్రం కదలించకుండా నడుముని మాత్రమే పైకి లేపాలి. ఈ ఆసనం వల్ల కిందిపొట్ట నుంచి పైపొట్ట వరకు పూర్తిగా సాగుతుంది. చేతులు, భుజాలు, పిరుదులు, నడుము దగ్గరున్న అధిక కొవ్వు త్వరగా కరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details