చిరుతిళ్లు, నూనె వస్తువులు, జంక్ ఫుడ్‌గా పరిగణించే వాటిని తరచూ తినడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం కలగవచ్చు. ఇటువంటి ఆహారం.. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసి కడుపు నొప్పి, మలబద్ధకం, ఆకలి లేకపోవటం మొదలైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
క్రమం తప్పకుండా చేసే యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుంది. శరీర సౌష్ఠవాన్ని కాపాడుతూ, శరీర సామర్ధ్యాన్ని పెంచి, రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తూ దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. యోగాలో గ్రాండ్ మాస్టర్ అయిన అక్షర్.. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచే 4 సరళమైన యోగాసనాల గురించి ఇలా వివరించారు.
వజ్రాసనం:
ఈ ఒక్క ఆసనం మాత్రమే భోజనం చేసిన తర్వాత చేయాలి.
ఆసనం ఎలా..
- నిటారుగా రెండు కాళ్లపై నిలబడి నిదానంగా ఊపిరి తీసుకుంటూ వదలాలి.
- కళ్లు మూసుకోవచ్చు.
- చేతులను నిటారుగా కిందకు ఉంచాలి.
- నిదానంగా కళ్లు తెరిచి నేల మీద కూర్చోవాలి.
- కాలి వేళ్లు బయటకి ఉండేట్టుగా మడమలపై కూర్చోవాలి.
- కాలి మడమలను దగ్గరగా ఉంచి, అరచేతులను మోకాళ్లపై ఆనించాలి.
- వెన్నెముకను నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ ఉండాలి.
- కాసేపు ఈ ఆసనంలో గడపాలి.
మలాసనం: