కరోనా విజృంభణను అరికట్టేందుకు లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఇందువల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. లాక్డౌన్ మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ బంధాలను మరింత బలపరుచుకోండి.
నేడు 'నేను' ఉపయోగమే అధికం
1950 కాలంలో ప్రజలు తమ బంధాలకు ఎందుకు అంత విలువ ఇచ్చేవారు తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ఇందుకు 100 సంభాషణలను పరిశీలించగా వారంతా ఎక్కువగా నేను అనే పదాన్నే ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా ఇది మానవుల మనస్తత్వాన్ని గురించి వెల్లడించింది. అసలు ఈ నేను, మీరు అనే పదాల మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు మోటివేషనల్ వక్త సైటెండర్ సెహ్రావత్. బంధాలకు విలువిచ్చే వారు అందరితోనూ ఎంతో సఖ్యతగా మెలుగుతారు. జీవిత భాగస్వామి, పిల్లలు, వ్యాపార భాగస్వాములు, వినియోగదారులు, పొరుగువారితో మంచిగా ఉంటారని తెలిపారు.
స్వీయ అవగాహన
చాలా మంది స్వీయ అవగాహనలో ఉన్న అపారమైన శక్తిని తక్కువ అంచనా వేస్తారు. లాక్డౌన్ సమయంలో బంధాలను దగ్గర చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. ఇంట్లో ఉండేవారికి చిన్న చిన్న పనుల్లో సాయపడాలి. సంబంధాలకు అడ్డుతగిలే కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
లాక్డౌన్ మీ సంబంధాలను దెబ్బతీస్తుందా?
రోజంతా కుటుంబ సభ్యులతో గడపడం అనేది ఓ సరికొత్త అనుభూతి. అయితే.. భవిష్యత్తు కోసం, ఆర్థికంగా ఎదిగేందుకు ఎక్కువ సమయం కేటాయించటం వల్ల కుటుంబీకులతో గడిపే అవకాశాన్ని కోల్పోతాం. దీని వల్ల నిరాశే అధికమవుతుంది. ఇది మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సమయాన్ని సరైన పద్ధతిలో మలుచుకుని.. బంధాలను పెంచుకోవాలి. లేదంటే అది సమస్యలు తెచ్చిపెడుతుంది.
కృతజ్ఞత..
వారాంతాల్లో మినహా మిగతా సమయాల్లో మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులతో సరిగా మాట్లాడటం కూడా కుదరదు. ఇక వారు ఏం చేస్తారో అసలే గమనించం. ఇందుకు ఓ రోజు మీ పాత్రను మార్చేయండి. రోజు ఏదో సమయంలో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులతో గడపండి. దీనివల్ల వారు ఎంతో ఆనందంగా ఉంటారు. మన ప్రియమైన వారికి కృతజ్ఞతలు తెలపడం బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.