ఓట్స్‌లో పీచు.. బీటా-గ్లూకాన్ రూపంలో ఉంటుంది. అందువల్ల వీటిని కొద్దిమొత్తంలో తీసుకున్నా సరే పొట్ట నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక. అలాగే పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. మలబద్ధకంతో బాధపడే వృద్ధులు వీటిని తీసుకుంటే మేలు.
- పాలిష్ చేసిన బియ్యం, గోధుమలకు బదులుగా ఓట్స్ వాడినప్పుడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి.
- ఓట్స్‌లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
- వీటిలోని బీటా గ్లూకాన్.. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
- వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ మెండుగా ఉంటాయి. దాంతో మన శరీరంలో ఇమ్యూనిటీ స్థాయి పెరుగుతుంది.
- ఓట్స్‌తో ఉప్మా, ఓట్స్ పిండితో చపాతీలు, పూరీలు, మసాలా ఓట్స్ వంటి రుచికరమైన పదార్థాలను చేసుకోవచ్చు.
- జాగ్రత్తలు:
- అందరికీ ఓట్స్ పడకపోవచ్చు. కాబట్టి వీటిని నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. ఓట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదు.
- మరి ఇంతటి ఆరోగ్యాన్నిచ్చే ఓట్స్‌ను రుచికరంగా తినాలనంటే ఇలా మసాలా ఓట్స్ చేసుకోవచ్చు.
మసాలా ఓట్స్