సృష్టి మనకిచ్చిన అద్భుత వరాల్లో శృంగారం కూడా ఒకటి. ఆడ, మగ కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది. అయితే వయసులో ఉన్న కొంతమంది యువకులకు అంగస్తంభన జరగదు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అందుకు కారణాలేంటి? ఈ ప్రశ్నలకు నిపుణులు డా.సమరం క్లుప్తంగా సమాధానమిచ్చారు.
"వయసులో ఉన్న యువకులకు అంగస్తంభన జరగకపోతే దానికి ఓ కారణం మానసిక సమస్య. ఒకర్ని ప్రేమించి .. మరొకర్ని పెళ్లి చేసుకుంటే సెక్స్‌పై కోరిక కలగదు. మనసులో ఎప్పుడూ ప్రియురాలు మెదులుతుంటుంది. మరికొంతమందికి తమకున్న సమస్యల వల్ల డిప్రెషన్లో ఉంటారు. అలాంటి వారికి కూడా శృంగారంపై ఆసక్తి కలగదు."
-డా. సమరం, నిపుణులు