తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బంగాళదుంప చిప్స్.. మూత్రపిండాలను దెబ్బ తీస్తాయా? - బంగాళాదుంప చిప్స్

బంగాళదుంప చిప్స్, చాక్లేట్లు, కుకీలు అంటే ఇష్టమా? కానీ మూత్రపిండాలకు అవి నష్టం కలిగిస్తాయి! సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్​లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఫ్యాక్టరీలలో తయారయ్యే ఇటువంటి చిరుతిళ్లు “లీకీ గట్ సిండ్రోమ్” అనే వ్యాధికి కారణమై మూత్రపిండాల జబ్బును కలుగజేయవచ్చు.

why eating potato chips chocolates may harm your kidneys
చాక్లేట్లు, బంగాళాదుంప చిప్స్ మూత్రపిండాలను దెబ్బ తీస్తాయా?

By

Published : Apr 7, 2021, 8:55 AM IST

పొటాటో చిప్స్, బేకరీలో నోరూరించే రంగుల రొట్టెలు, కుకీలు తినాలనిపిస్తోందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఎలుకలపై జరిపిన ఒక పరిశోధన ప్రకారం లీకీ గట్ సిండ్రోమ్ (చిల్లుల పేగు కాయిలా) కలుగుతుందని ఆ తరువాత అది మూత్రపిండాలకు ప్రమాదమని రుజువైంది.

ఆస్ట్రేలియాలో మొనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం ఇటువంటి ఆహారపదార్ధాలు యంత్రాల వేడి వాతావరణంలో సిద్ధమవటం వల్ల గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనే రసాయనాలు వాటిలో పేరుకుంటాయి. ఈ పదార్ధాలు కాల్చటం, మాడ్చటం, వేపటం వల్ల తయారైన ఆకర్షణీయమైన రంగును, రుచిని, వాసనను ఆ తినుబండారాలకు ఇస్తాయి. ఈ గ్లైకేషన్ పదార్ధాలు “మెయిలర్డ్ ప్రతిచర్య”ను పురికొల్పి శరీరంలో శోథను కలుగచేసి దీర్ఘకాలంలో మూత్రపిండాల జబ్బును కలగచేస్తాయి.

అయినప్పటికీ, ఎక్కువ పీచు పదార్ధం ఉన్న ఓట్స్, వండి చల్లార్చిన బియ్యం, బార్లీ, చిక్కుడు, బఠాణీ, ఉడికించి చల్లార్చిన బంగాళదుంపలు పేగుల ఆరోగ్యాన్ని రక్షించి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని సైన్స్ అడ్వాన్సెస్ పత్రిక తెలియజేస్తోంది.

ఈ ఆహార పదార్ధాలు పేగుల్లో నివసించే బ్యాక్టీరియాకు చాలా అవసరం కూడా. ఈ బ్యాక్టీరియాలు పీచు కలిగిన ఈ ఆహారపదార్ధాలను జీర్ణం చేసుకునే క్రమంలో పులియబెట్టగా విడుదలయ్యే పదార్ధాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ (శోథ) ను తగ్గిస్తాయని మొనాష్ కేంద్ర సంస్థ మధుమేహ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేసే మెలిండా కౌఘ్లాన్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా 10శాతంమంది ప్రజలు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారు. శరీర ఆరోగ్యానికి దోహదం చేయని సిద్ధ ఆహారం తినటం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, క్యాన్సర్, జీర్ణమండల వ్యాధులు కలిగే అవకాశం పెరుగుతుంది. ఆహారంలో మార్పులు, మన ప్రవర్తనలో మార్పుచేర్పులు సుదీర్ఘ కాలం నిర్వహించుకోవటం కష్టమే. అయితే, ఎక్కువ పీచు ఉన్న ఆహారపదార్ధాలను తీసుకోవటం ద్వారా, ఆహారం వండే క్రమంలో ఆవిరి ద్వారా వేడి చేయటం, సాంప్రదాయకంగా వేడి చేయటం ద్వారా ఆహారంలోని ఘటకాలు కలుగచేసే నష్టాలను నివారించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details