Why Do We Feel Relax After Sex : జీవుల మనుగడకు, వంశాభివృద్ధికి శృంగారం కచ్చితంగా కావాలి. కచ్చితంగా చెప్పాలంటే సెక్స్ లేకుంటే మానవ మనుగడే లేదు. సాధారణంగా సెక్స్ చేసిన తర్వాత ఒక రకమైన మంచి రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? దీనికి కారణం ఏమిటి? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? దానికి సమాధానం ఇదిగో..
ఫీల్ గుడ్ హార్మోన్లివే..!
Feel Good Hormone Release After Sex : సెక్స్ తరువాత రిలీఫ్ ఫీలింగ్ కలగడానికి ప్రధాన కారణం ఫీల్ గుడ్ హార్మోన్స్. మనస్సులో సెక్స్ పరమైన కోరికలు ఎప్పుడు కలుగుతాయో.. అప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, కార్టిసాల్ మొదలైన ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. వీటినే లవ్ హార్మోన్స్ అని కూడా అంటారు. ఇవి మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా డోపమైన్ అనే హార్మోన్ మూడ్‌ని పెంచుతుంది. హుషారుని కలిగించి మనస్సుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగిస్తుంది.
ఆ ఫీలింగే వేరు!
Feel Good Hormone Health Benefits :సెరోటోనిన్ అనే మరో హార్మోన్ మనలోని డిప్రెషన్, డల్నెస్ను పోగొడుతుంది. నిత్యజీవితంలో మనం ఎన్నో ఒత్తిడిలు, ఆందోళనలు ఎదుర్కొంటాం. సెరోటోనిన్ వీటన్నింటినీ మనకు దూరం చేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఆక్సిటోసిన్ హార్మోన్.. సెక్స్ కోరికను, శృంగారం కావాలనే తహతహను పెంచుతుంది. శృంగారంలో పాల్గొంటే సుఖం కలుగుతుంది. అయితే శృంగారం తర్వాత శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మూడ్ అంతటినీ ఉల్లాసంగా మారుస్తాయి. ఫలితంగా సెక్స్ అనంతరం మంచి నిద్ర వస్తుంది.