సెక్స్ కోరికలు మగవారిలో ఎక్కువగా ఉంటాయా? ఆడవారిలో ఎక్కువగా ఉంటాయా? కొన్ని సర్వే సంస్థలు మగవారిలో అని చెబితే.. మరికొన్ని సర్వే సంస్థలు ఆడవారిలో అని నివేదికలు ఇస్తున్నాయి. అయితే సమాజంలో మాత్రం మహిళలతో పోల్చితే పురుషులు సెక్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతారని అంటుంటారు. అయితే ఇందులో ఏది నిజం? నిపుణులు ఏం అంటున్నారు.
శృంగార కోరికలు ఆడవారిలో, మగవారిలో.. ఇద్దరిలోనూ సమానంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ అని ఉండదని చెబుతున్నారు. సమాజంలో సెక్స్ విషయంలో ఆడవాళ్లకు అంతగా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంటున్నారు. మగువలకు సెక్స్ కోరికలు కలిగినా.. సమాజంలోని పరిస్థితులకు తలొగ్గి.. వాటిని బయటపెట్టరని చెబుతున్నారు. కేవలం భౌతిక రూపాల్లోనే తేడాగా ఉంటాయని.. శృంగారం విషయంలో ఇద్దరూ సమానమే అని అంటున్నారు.