తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ చిన్నారి గుక్కపట్టి ఏడిస్తే ముఖం నీలంగా మారుతోందా? - చిన్నారుల్లో సమస్యలు

చిన్నారులు.. ప్రధానంగా నెలల పిల్లలు ఎక్కువగా గుక్కపట్టి (Breath Holding Spells) ఏడుస్తుంటారు. ఈ క్రమంలో కొందరిలో పెదాలు, ఒక్కోసారి ముఖం నీలంగా మారుతుంటుంది. ఇది చూసి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. అసలు ఈ సమస్యకు గల కారణం.. దీనికి తగిన పరిష్కారంపై నిపుణులు ఏమంటున్నారంటే..

baby crying
చిన్నారి గుక్కపట్టి ఏడిస్తే ముఖం నీలంగా మారుతోందా?

By

Published : Nov 24, 2021, 8:17 AM IST

పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ మధ్య మధ్యలో శ్వాసతీసుకోవడం ఆపుతుంటారు. దీనినే బ్రీత్​ హోల్డింగ్​ స్పెల్స్ (Breath Holding Spells)​ అంటారు. ఇందులో భాగంగా ఒక్కోసారి వారి ముఖం లేదా పెదవులు నీలంగా మారుతుంటాయి. ఏడుపు తారస్థాయికి చేరినప్పుడు (Breath Holding Spells) పలు సందర్భాల్లో చిన్నారులు స్పృహకోల్పోయి జెర్క్స్​ వస్తుంటాయి. దాదాపు ఫిట్స్​ను పోలి ఉన్న ఈ సమస్యకు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కోపం, ఏదైనా నొప్పి, ఇంకా తన మాట వినడం లేదనే మొండితనం (Breath Holding Spells) కారణంగా పిల్లల్లో ఏడుపు మొదలై తారస్థాయికి వెళ్తుందని.. ఆ తర్వాత అది కాస్త ఊపిరి అందక ఇబ్బంది పెడుతుందని నిపుణులు పేర్కొన్నారు. హెమోగ్లోబిన్,​ ఐరన్​ తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ బ్రీత్​ హోల్డింగ్​ స్పెల్స్​ అనేవి అధికంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దీనికి చికిత్స ఉంటుందా?

దీనికి ప్రత్యేకించి చికిత్స అంటూ ఏం ఉండదు. పరీక్షల ద్వారా హెమోగ్లోబిన్​, ఐరన్​ డెఫిషియన్సీలకు సంబంధించి వివరాలు తెలుసుకుని అందుకు తగిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మందులు లేదా ఆహారం ద్వారా అయినా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కానీ ఆహారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పంచదార స్థానంలో బెల్లం వాడటం, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవడం ద్వారా దీనికి చెక్​ పెట్టొచ్చు అంటున్నారు.

సమస్య మరింత ఎక్కువగా వస్తోందంటే దానిని ఆపేందుకు పేరెంట్స్​ లేదా ఇతర కుటుంబసభ్యులు తమ వంతు పాత్ర పోషించాలిని సూచిస్తున్నారు. చిన్నారికి కావాల్సిన మోతాదులో రెస్ట్​ ఉండాలని.. రెస్ట్​లెస్​గా ఉండటం గుక్కపట్టి ఏడవటానికి దారితీయొచ్చని తెలిపారు.

ఇదీ చూడండి :Salt Effects: ఉప్పు.. మెదడు ఆరోగ్యానికి ముప్పు!

ABOUT THE AUTHOR

...view details