తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సాయంత్రం క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారా.. జాగ్రత్త! - ప్రోటీన్ ఫుడ్

జీవక్రియలో జీవగడియారం అనేది కీలకమైనది అంటున్నారు పరిశోధకులు. ఆహారం తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం అంటున్నారు. అల్పాహారంలో ప్రొటీన్‌ పదార్థాలు ఎక్కువగా తింటే జీవక్రియ మెరుగవుతుందనీ తద్వారా ఎముక కండరాల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు.

time to take protein food
ప్రోటీన్ ఫుడ్

By

Published : Aug 1, 2021, 10:30 AM IST

రోజూ పోషకాహారం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఏమి తింటున్నాం అన్నదాంతోపాటు ఏ సమయంలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అంటున్నాయి తాజా పరిశోధనలు. అందులో భాగంగానే- ఉదయాన్నే అల్పాహారంలో ప్రొటీన్‌ పదార్థాలు ఎక్కువగా తింటే జీవక్రియ మెరుగవుతుందనీ తద్వారా ఎముక కండరాల ఆరోగ్యం బాగుంటుందనీ చెబుతున్నారు జపాన్‌ పరిశోధకులు.

అంతేకాదు, ఉదయం వేళలో కాకుండా సాయంకాలాల్లో ఎక్కువ క్యాలరీలు తీసుకున్నవాళ్లే ఎక్కువ ఊబకాయులుగా మారుతున్నారని కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ విషయమై వీళ్లు ఎలుకల్ని రెండు వర్గాలుగా విభజించి వేర్వేరు సమయాల్లో వాటికి ప్రొటీన్‌ ఆహారాన్ని ఇచ్చి పరిశీలించారట. అందులో రాత్రివేళ ప్రొటీన్‌ తీసుకున్నవాళ్లతో పోలిస్తే- ఉదయం తీసుకున్నవాళ్లలోనే ఎముక కండరాల పెరుగుదల బాగున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి జీవక్రియలో జీవగడియారం అనేది కీలకమైనది అంటున్నారు సదరు పరిశోధకులు.

ABOUT THE AUTHOR

...view details