When Should Take Medical Treatment For Pimples :యుక్త వయస్సులో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలను మొటిమల సమస్య వేధిస్తుంటుంది. సాధారణంగా శరీరంలోని వేడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, కాలుష్యం వంటి.. వివిధ కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి. వీటి వల్ల ఏర్పడే మచ్చలు, ఎర్రటి మొటిమలు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. చర్మ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. అయితే, ఈ మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి.. ఆ లక్షణాలు ఏంటి? సమస్య తీవ్రం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మొటిమలు రాకుండా ఏ ఆహారం తీసుకోవాలి..?
- ఓమేగా-3 ఫ్యాటీ అమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్‌నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు తీసుకోవాలి.
- మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నవారు రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మంచిది.
- గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, మొటిమల సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
- టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. వీటిని వంటల్లో ఎక్కువగా వాడడం వల్ల మొటిమల సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చని నిపుణులు అంటున్నారు. టమాటా సూప్ తాగినా లాభం ఉంటుంది.
- మొటిమల సమస్యతో విసిగిపోతున్న వారు రోజూ 8 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
- రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు కూడా తాగాలని సూచిస్తున్నారు.
- విటమిన్ ఇ ఎక్కువగా ఉండే.. నట్స్, గుడ్లు, తాజా పండ్లను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.