మహిళల్లో పీరియడ్స్ అనేది సాధారణ ప్రక్రియ. అయితే.. ఈ నెలసరి విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చేసరికి.. ఆ అపోహలు పెరిగిపోతాయి. అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యాభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.
అయితే.. చాలా మందికి మరో అనుమానం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుందా? రాదా? అని. దీని గురించి నిపుణులు తాజాగా ఓ వివరణ ఇచ్చారు. "పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం దాల్చేే అవకాశం ఉండదు. అలా అని అసలు రాదు అని కూడా చెప్పలేం కానీ వచ్చే అవకాశాలు చాలా అరుదు. శృంగారం సమయంలో విడుదలయ్యే వీర్య కణంతో అండం కలిసినా ఆ బీజం కొంచెం కూడా పెరగదు. అందువల్ల గర్భం రావడానికి కుదరదు." అని నిపుణులు చెబుతున్నారు.