తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'గోధుమ పిండి'తో అందంగా మారిపోదామిలా - etv bharat health

గోధుమలు ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తాయి. ముఖంలో జిడ్డు తొలగిపోవడానికి, నల్ల మచ్చలు, నలుపు పోవడానికీ గోధుమపిండితో వేసే పూత చక్కని ఫలితాలనిస్తుంది. అంతేనా గోధుమలతో ఇంకెన్నో లాభాలున్నాయి.. అవేంటో చూసేయండి.

wheat-flour-mask-for-skin-beauty
'గోధుమ పిండి'తో అందంగా మారిపోదామిలా

By

Published : Sep 25, 2020, 10:30 AM IST

Updated : Sep 25, 2020, 10:47 AM IST

గోధుమలోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచితే అదే గోధుమ బాహ్య అందాన్ని రెట్టింపు చేస్తుంది.

మూడు చెంచాల గోరువెచ్చని పాలల్లో చెంచా గులాబీనీరూ, కొద్దిగా తేనె, రెండు చెంచాల గోధుమపిండిని వేసి ఉండ కట్టకుండా కలపాలి. దీన్ని ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్‌ రాయాలి. తేమతో చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

రెండు చెంచాల పాలమీగడకు గోధుమపిండి కలిపి చక్కని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ పూతకి చర్మంలోని మెలనిన్‌ని నియంత్రించి నల్లమచ్చలు రాకుండా చేసే శక్తి ఉంది.

నాలుగుచెంచాల గోధుమపిండికి తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.. జిడ్డుపోయి ముఖం కాంతితో నిగారిస్తుంది. ఛాయ పెరుగుతుంది.

ఒక కప్పు వేడినీటిలో గుప్పెడు గులాబీ రేకలూ, కొద్దిగా తేనె, చెంచా నిమ్మతొక్కల పొడీ వేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇది ముఖంలోని ముడతలని తగ్గించి గరుకుగా ఉండే చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

ఇదీ చదవండి: చురుగ్గా, ప్రశాంతంగా బతికేయండిలా..!

Last Updated : Sep 25, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details