బరువు పెరగడానికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవే బరువు పెరగడానికి అడ్డుపడవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా సమస్యలు? బరువు పెరగకుండా అవి మనల్ని ఎలా ఆపుతున్నాయి? బరువు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి (Weight Gain Tips) అనేది తెలుసుకుందాం.
- బరువు పెరిగేందుకు మీరు సరైన ఆహార నియమాలు (Weight Gain Food) పాటిస్తున్నారా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి.
- సాధారణ ఆహార పదార్థాలు తీసుకుంటూ బరువు పెరగకుండా ఉన్నారంటే వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది థైరాయిడ్ సమస్య. ఇది ఉన్న వారిలో బరువు పెరగడం అనేది చాలా తక్కువగా..లేక అసలు ఉండకపోవచ్చు. దీని కోసం డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్‌కు సంబంధించిన టీ3, టీ4, టీఎస్ అనే మూడు పరీక్షలు చేయించుకోవాలి.
- బరువు పెరగకపోవడానికి మరో కారణం షుగర్ వ్యాధి. ఇందుకోసం డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలి.
- ఇవి ప్రాథమికంగా చేయించుకోవాల్సిన పరీక్షలు. ఆ తరువాత అప్పర్ జీఐ ఎండోస్కోపీ, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్ లాంటి పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
- వీటికి తోడు బరువు పెరగని వ్యక్తి ముందుగా బీఎంఐ చెక్ చేసుకోవాలి. ఇందులో 25 కంటే ఎక్కువ ఉంటే వారు అధిక బరువు ఉన్నట్లు గుర్తిస్తాం. 20 కంటే తక్కువ ఉంటే వారు తక్కువ బరువు ఉన్నట్లు పరిగణిస్తారు.
- తీసుకోవాల్సిన ఆహారం..
- బరువు పెరగాలి అనుకునే వారు ఎక్కువగా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
- పీచు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం (Weight Gain Food) తీసుకోవడం ఉత్తమం.
- ఆరోగ్యకరమైన కొవ్వులుండే అవకాడో, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చేపలు, సోయా పాలు, టోఫు, వాల్‌నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు వెజిటెబుల్ సలాడ్, ప్రొటీన్ షేక్స్ తీసుకోవడం మరీ మంచిది.
- చాలామంది తక్కువ తినడానికి.. భోజనానికి ముందు కొన్ని నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు పెరగాలనుకునే వారు ఇలా చేయకపోవడమే మంచిది. తద్వారా కడుపు నిండా ఆహారం తీసుకొని బరువు పెరగచ్చు.
- త్వరగా బరువు పెరగాలని కొంతమంది పిజ్జా, బర్గర్.. వంటి ఫాస్ట్‌ఫుడ్స్ వెంట పరుగు పెడతారు. కానీ అలా పెరిగిన బరువు అనారోగ్యకరమైందని గుర్తుపెట్టుకోండి. తద్వారా అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి చేరి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగడమే ఉత్తమం.