తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఏ వయసులో గర్భం దాలిస్తే మంచిది? - ప్రగ్నెన్సీకి అనువైన వయసు

చిన్న వయసులోనే పిల్లల్ని కనటం మంచిది కాదని చాలా మంది అంటారు. అలాగని వయసు దాటాక కనటం అస్సలు శ్రేయస్కరం కాదనీ చెబుతుంటారు. మరి ఒక స్త్రీ ఏ వయసులో పిల్లల్ని కనటం మంచిది?. దీనిపై నిపుణుల సూచనలు ఏమిటో తెలుసుకోండి.

pregnancy
ప్రెగ్నెన్సీ, గర్భం

By

Published : Aug 29, 2021, 7:01 AM IST

గర్భం ధరించడమనేది స్త్రీ జీవితంలో చాలా ఆనందకరమైన విషయం. అయితే.. గర్భానికి సంబంధించిన విషయంలో చాలా మంది స్త్రీలు ఒత్తిడికి గురవుతున్నారు. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనమని అత్తామామ ఒత్తిడి చేయడం, వైవాహిక జీవితం కొంత కాలం ఆనందంగా గడిపాకే పిల్లల్ని కందామని భర్త చెబుతుండటం ఇందుకు కారణాలు. అయితే.. ఈ ఒత్తిడిని ఎలా జయించాలి? ఒక స్త్రీ పెగ్రెన్సీకి అనువైన సమయమేది? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ వ్యవధిలోనే..

18 నుంచి 35 ఏళ్ల లోపు.. స్త్రీ శరీరంలో జరిగే అండోత్పత్తికి కారణమయ్యే అండాలు దృఢంగా ఉంటాయి. 18 ఏళ్ల లోపు వారిలో గర్భాశయం, అండాశయం పూర్తిగా పరిపక్వత చెంది ఉండవు. అయితే.. 18 నుంచి 22 ఏళ్ల మధ్య స్త్రీ మానసికంగా దృఢంగా ఉండకపోవచ్చు. కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి వారికి సమయం పడుతుంది. 22-28 ఏళ్ల మధ్య స్త్రీ గర్భం దాల్చితే.. పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలున్నాయి. అదే 35 ఏళ్ల తర్వాత అయితే.. అండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే 22-28 అనేది స్త్రీ గర్భధారణకు మంచి సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:గర్భంతో ఉన్నవారు ఇవి అస్సలు చేయకూడదు!

ABOUT THE AUTHOR

...view details