How to Get Rid of Brain Fog: మానసిక గందరగోళం, ఏ విషయం పైనా స్పష్టత లేకపోవడం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది.. ఇలాంటి స్థితిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. అయితే.. బ్రెయిన్ ఫాగ్ అనేది మెడికల్ కండిషన్ కాదు. జ్ఞాపక శక్తి లోపించడం.. ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి వైఫల్యాల సమూహం. ఈ లక్షణాలు ఉన్నవారు.. ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో, దేన్నైనా గుర్తుకు తెచ్చుకోవడంలో, ఏకాగ్రత లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బంది పడతారు. మానసికంగా అలసిపోతారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. శాశ్వతంగా ఉండిపోతాయనే ఆందోళన అవసరం లేదు.
కళ్లలో సమస్యలా? భవిష్యత్తులో ఇబ్బందులే - ఇలా కాపాడుకోండి!
ఎవరికి వస్తుంది? :బ్రెయిన్ ఫాగ్.. పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి పెద్దవారి వరకు.. అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో సేమ్ లక్షణాలు ఉండొచ్చు.. వేర్వేరుగా ఉండొచ్చు.అందులో కొన్ని..
- ఏకాగ్రత తగ్గడం
- జ్ఞాపక శక్తిని కోల్పోవడం
- అస్పష్టమైన ఆలోచనలు
- తీవ్రమైన అలసట
- నిరుత్సాహంగా ఉండటం
నెలసరి ముందు సమస్యలా? ఈ టిప్స్‌తో అన్నీ మాయం!
బ్రెయిన్ ఫాగ్ కారణాలు:దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని చూస్తే..
డిజిటల్ పరికరాల ఉపయోగం:ప్రస్తుత కాలంలో డిజిటల్ పరికరాల వినియోగం అధికమైంది. దీంతో మెదడుకు పని చెప్పడం మానేశాం.. ఏ పని చేయాలన్నా వీటిపై ఆధారపడటం వల్ల మన ఆలోచన తీరు.. గుర్తుంచుకోగల సామర్థ్యం దెబ్బతింటుంది.
ఒత్తిడి:అధిక ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడుపై అధిక పనిభారాన్ని, పీడనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, మానసిక అలసట, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, కుంగుబాటుకు లోనుకావడం కూడా జరగవచ్చు. ఇది మీ మెదడు సరిగా పనిచేయక, ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది.